టీఆర్ఎస్ నేతలు పట్టభద్రులను ఓట్టు అడిగితే నిలదీయాలి: బిజెపి నేతలు

Published: Friday March 05, 2021
బాలాపూర్: ప్రజాపాలన న్యూస్; పట్టభద్రులు టీఆర్ఎస్ నేతలను ఓట్లు అడగడానికి వస్తే నిలదీయండి? నిరుద్యోగ, ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు ఎన్నికల  జిమ్మిక్కులు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ మరి జాగ్రత్త... మున్సిపల్, కార్పొరేషన్  నేతలతో టెలికాన్ఫరెన్స్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు వస్తే పట్టభద్రులు నిలదీయాలని పిలుపునిచ్చారు. గురువారం నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్లల్లో అందుబాటులో ఉన్న కార్పొరేటర్లతో టెలికాన్ఫరేన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.... ఇన్నాళ్లు నిరుద్యోగులు, ఉద్యోగులను మోసం చేసుకుంటూ సీఎం కేసీఆర్ కాలం వెళ్లదీశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో నిరుద్యోగులు, ఉద్యోగులు గుర్తొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు వంత పాడుతూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చకుండా... తుంగలో తొక్కారని మండిపడ్డారు అందెల. ఉద్యోగాల భర్తీపై మంత్రి సబితా సైతం పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. మొదట విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేసి పేద విద్యార్థులకు చదువుపై భరోసా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యావాలంటీర్లను సైతం భర్తీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో విద్యాశాఖ మంత్రి ఇంతవరకు సమీక్ష నిర్వహించకపోవటం దారుణమన్నారు. మంత్రి పదవి కోసమే ఖాళీల భర్తీపై నోరు మెదపలేక పోతున్నారని సబితారెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు అందెల శ్రీరాములు యాదవ్. ఎన్. రామచందర్ రావుకు మన మహేశ్వరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రతీ బీజేపీ సైనికుడు పని చేయాలన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచందర్ రావుకు ఇతర పార్టీల అభ్యర్థులు దరిదాపుల్లో కూడా లేరని ధీమా వ్యక్తం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చేశారు.