రైతుల ధాన్యాం కటింగ్ లేకుండా మిల్లర్లు కొనుగోలు చేయాలి: వడ్లూరి లక్ష్మణ్ కుమార్

Published: Thursday November 18, 2021

వెల్గటూర్, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా డి‌సి.సి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్  మండలం లోని అంబారిపేట్, ముత్తు నూర్ మరియు జగదేవ్ పేట్ గ్రామాలలో బుధవారం రోజు వడ్ల సెంటర్లను దర్శించారు. వరి కొనుగోలు కేంద్రాల లో రైతులు పడుతున్న బాధలను విని తొందరగా వడ్లను కొనుగోలు మిల్లర్ల మొదలుపెట్టాలి అలాగే తప్ప, తలు లేకుండా ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతుల బాధలను విని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమములో వెల్గటూర్ కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, గుండంటి జితేందర్ రెడ్డి, మెరుగు మురళి, శ్రీకాంత్ రావు, ముత్తు నూర్ ఎం‌పి.టి.సి మంజుల, వెంకటస్వామి, సత్య నారాయణ రావు, పుధరి రమేష్, సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు గొల్ల తిరుపతి, లచ్చిరెడ్డి, గంగయ్య. గడ్డం మల్లారెడ్డి. తిరుపతి, హరీష్, తిరుపతిరెడ్డి, శంకరయ్య, గుండంటి వెంకట్ రెడ్డి, సింగతీమహేష్, బోరకుంట రాజయ్య, రైతులు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.