శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పూజలు ఎర్రుపాలెం

Published: Thursday October 06, 2022

 అక్టోబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెంమండలం జమలాపురం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు మహర్నవమి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈరోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని   అలంకారం లో భక్తులకు దర్శనం ఇచ్చినారు. ప్రాతఃకాల పూజల అనంతరం గోపూజ నిర్వహించినాము. నిత్య హోమములు, అనుష్టానములు జరుపబడినవి. అనంతరం  యాగశాలలో ఏర్పాటు చేసిన మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా  భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  అనంతరం  దేవస్థాన ప్రాకార మండపంలో చండీ హోమము నిర్వహించడం జరిగినది.ఛండీ హోమం లో 17 మంది దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించబడుచున్న చండీ హోమం కార్యక్రమాలు ఈరోజు 12 గంటల 30 నిమిషములకు పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం చండీ హోమ కార్యక్రమాలు ముగిసినాయి.చండీ హోమంలో పాల్గొన్న వారికి స్వామివారి శేష వస్త్రములు, ప్రసాదములు అందజేయడం జరిగినది.అనంతరం భక్తులకు  తీర్థ ప్రసాదముల వితరణ జరిగింది. ఈరోజు దేవస్థానం యొక్క అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రంలో భక్తులందరికీ విశేషంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేద పండితులు,రుత్వికులు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు బి.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయ కుమారి, సిబ్బంది, భక్తులు మరియు జమలాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేసినారు.రేపు అనగా  బుధవారం సాయంత్రం 5-30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యాగశాల వద్ద శమీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుంది. ఆలయ కమిటీ వారు తెలిపారు