డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తుల కు ఫ్యామిలీ కౌన్సిలింగ్,

Published: Tuesday June 07, 2022

 

కరీంనగర్ జూన్ 6 ప్రజాపాలన క్రైమ్ :

కరీంనగర్ సి.పి. వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు  ట్రాఫిక్ ఏసీపీ జి. విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  జి. తిరుమల్, ఈ నాగార్జున రావు ఈ రోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో బాగంగా ట్రాఫిక్ ఏసీపీ  జి. విజయకుమార్,  మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాన్ని మద్యం సేవించి నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని, రోడ్డుప్రమాదం జరుగుతే వాహనదారులే కాకుండా  వాహనదారుని కుటుంబం కూడ రోడ్డుమిదపడే అవకాశం ఉందని,కనుక మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్ట్ ఆదేశాలమేరకు జైలు  జరిమానా పడి వారియొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతాయని హెచ్చరించారు. ఇకముందు రోజు పగలు, రాత్రులు  డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ లు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ఈ సంవత్సరము 9 వందల 83  కుటుంబాలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ ఏసీపీ జి. విజయకుమార్  చెప్పడం జరిగినది.కరీంనగర్ జూన్ 6 ప్రజాపాలన క్రైమ్ :