ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి

Published: Thursday April 06, 2023
జన్నారం, ఏప్రిల్ 05, ప్రజా టపాలన' భారత దేశ మాజీ ఉప ప్రధాని, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జాగ్జీవన్ రామ్ (116) జయంతిని జన్నారం మండల కేంద్రము లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన లో  మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ భవనంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ మాట్లాడుతూ దేశ ప్రజలకు అవసరమైన అన్ని రకాల హక్కులను అందించారన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్తన్నారు. ఈ ఉప ప్రధాని గా అట్టడుగు వర్గాలు, పేద ప్రజలు ప్రగతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్ అన్నారు. తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిటిమల్ల భరత్ కుమార్, దళిత సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా గడ్డం శ్రీనివాస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు, మామిడిపల్లి ఇందయ్య, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం జిల్లా ఉపధ్యక్షుడు, దుమల్ల ప్రశాంత్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు, దుమాల్ల రమేష్, మండల సీనియర్ నాయకులు, ముత్యం సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీష్, బి ఆర్ ఎస్ఐ మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, సాయిని ప్రసాద్ నేత నేతకని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బచ్చల శివ , మంద రాజేష్ యువ నాయకుడు,రాము, ప్రభాకర్, గ్రామస్తులు, వార్డ్ మెంబర్, తరతరములు పాల్గొన్నారు.