సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో

Published: Tuesday March 22, 2022
ముగింపు కళాకారుల నాటక పోటీలు
మధిర మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గత మూడు రోజుల నుంచి రెండు రాష్ట్రాల నాటక పోటీల్లో భాగంగా సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో లోముగింపు రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో భాగంగా మొదటి ద్వితీయ బహుమతులరావణ బ్రహ్మపాత్రలో వెంకటస్వామి బహుమతి అందుకుంటున్న వెంకటస్వామినాటక పోటీలు గర్జించిన రావణ బ్రహ్మకేరింతలు కొట్టిన కళాకారులు మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కళ్యాణ మండపంలో గత మూడు రోజులుగా మాటూరు పేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపకులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రెండు రాష్ట్రాల స్థాయి పౌరాణిక సాంఘిక ఏకపాత్రాభినయం నాటక పోటీలు సోమవారం ముగిసాయి. ఈ పోటీలకు తెలుగు రెండు రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి కళాకారులు హాజరై తమ తమ నటనా ప్రదర్శనలతో కళాకారులను మెప్పించారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది కళాకారులు మధిరలో నిర్వహించిన నాటక పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. హైదరాబాద్ కు చెందిన బాపన్ పల్లి వెంకటస్వామి ప్రదర్శించిన రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం కళాకారులను ఉర్రూతలూగించింది. ఆయన ప్రదర్శించిన రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం పాత్రలో కుమారస్వామి హావభావాలు పాత్రలో లీనమైన తీరు ఎంతో రక్తికట్టించింది. తెలుగు రెండు రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ ద్వితీయ బహుమతిని బాపన్ పల్లి వెంకట స్వామి పొందారు. నిర్వాహకులు బాపన్ పల్లి వెంకట స్వామి పేరు ప్రకటించగానే కళాకారులు చప్పట్లతో మద్దతు ప్రకటించడం విశేషం. గతంలో ఆయన రెండుసార్లు మేకప్ ఆర్టిస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు సైతం పొందారు. ఏకపాత్రాభినయం పోటీల్లో కేవలం రెండవ ప్రదర్శనలో నే వెంకటస్వామి అత్యంత ప్రతిభ కనబరిచి కళాకారులను మెప్పించి నిర్వాహకులకు చేతులమీదుగా ద్వితీయ బహుమతులు పొందారు అదేవిధంగా ప్రథమ బహుమతిని రాముడు పాత్రధారి పోషించిన బాపిరాజు మూడో బహుమతి చంద్రమతి పాత్రధారి ప్రదర్శించిన సాయి లక్ష్మి చాగంటి పొందారు. ఈ సందర్భంగా మాటూరు పేట శ్రీ సీతారామాంజ నేయ కళాపరిషత్ వ్యవస్థాపకులు గడ్డం సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రెండు రాష్ట్రాల స్థాయిలో పౌరాణిక సాంఘిక నాటక పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జిల్లా స్థాయిలో కళాకారులకు వన సమారాధన నిర్వహించి ప్రతిభ కనపరిచిన కళాకారులను సన్మానించడం జరుగుతుందన్నారు అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు పుతుంబాకా శ్రీకృష్ణ ప్రసాద్, కార్యదర్శి గడ్డం శ్రీనివాస రావు కళాకారులు టీవీ రెడ్డి, బాబ్ల, లంకా కొండయ్య పసుపులేటి నాగేంద్రశ్రీనివాసరావు సహకారంతో నాటక పోటీలు విజయవంతంగా పూర్తయినట్లు ఆయన తెలిపారు.