కోటమర్పల్లి గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం

Published: Monday March 21, 2022
జడ్పిటిసి పబ్బె మధుకర్
వికారాబాద్ బ్యూరో 19 మార్చ్ ప్రజాపాలన : గ్రామ అభివృద్ధికి రవాణా వ్యవస్థ అత్యంత ఆవశ్యకమని మర్పల్లి మండల జడ్పిటిసి పబ్బె మధుకర్ అన్నారు. ఆదివారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను మర్పల్లి మండల జెడ్ పిటిసి మధుకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ 5 లక్షలు, డిఎంఎఫ్ టి 3 లక్షలు, జిల్లా పరిషత్ 10 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలోని ఏ ఏ వార్డులలో రోడ్ల నిర్మాణం అత్యంత ఆవశ్యకం ఉన్నదో గుర్తించి ఆ వార్డులలో నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ పనులను ఎంపిటిసి సుజాత వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బి.రాచయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు రఘుపతి రెడ్డి, అనంత్ రెడ్డి, మాజీ విఆర్ ఓ కృష్ణయ్యలతో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైహింద్ రెడ్డి, రవి, రాహుల్, టిఆర్ఎస్ గ్రామ కమిటి ప్రెసిడెంట్ తహసిన్, ఉపాధ్యక్షుడు రాజు, నర్సింహా, మండల రైతు బంధు మెంబర్ నర్సింహా రెడ్డి, నజీర్, జిలాని, బోయిని పాండు, శివలింగం, ప్రభు, సురేందర్ రెడ్డి, బి.యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.