సిఐటియు రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్లు విడుదల.

Published: Saturday October 29, 2022
 జన్నారం, అక్టోబర్ 28, ప్రజాపాలన: తెలంగాణ బిల్డింగ్ &ఆదర్ కన్ స్ట్రక్ క్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర 3వ మహాసభలు పోస్టర్లులను మండల కేంద్రంలో విడుదల చేయడం జరిగిందని, సిఐటియు మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక చట్టాల రక్షణ కై నవంబర్ 8,9 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్ విడుదల చేయడం జరిగిందని అయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కొత్త స్కింలను ప్రవేశ పెట్టాలని, ఒకవేళ కార్మికులు మరణిస్తే 10లక్షలు, సహజ మరణం అయితే 3లక్షలు, పెండ్లి, ప్రసూతిలకు రూ,1లక్ష పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు వేచి ఉండు కనీస సౌకర్యాలు త్రాగునిరు, మరుగుదొడ్లు, షెడ్లు నిర్మించాలని, అదేవిధంగా వేచి ఉండు స్థలం వద్ద కార్మికులకు అందుబాటులో రూ,5/- భోజనం ఏర్పాటు చేయాలని, కార్మికుల సంక్షేమం కొరకు ఉన్న నిధులను పక్క దారి మల్లించకుండా, కార్మికుల సంక్షేమం కొరకు ఉపయోగించాలని ఇతర సమస్యలు పరిష్కారం కొరకు ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కావున కార్మికులు, అందరు ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బుచ్చన్న, మండల నాయకులు కొండగొర్ల లింగన్న , తదితరులు పాల్గొన్నారు.