నత్తనడకన ఈ - శ్రామ్ నమోదు ప్రక్రియ

Published: Thursday November 11, 2021
మధిర నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : చేనేత ,వడ్రంగి ,నాయి బ్రాహ్మణ, ఉపాధి హామీ కూలీలు, పశుసంవర్ధక కూలీలు, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు కూరగాయలు పండ్లు విక్రేతలు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, వీధి వర్తకులు, వలస కార్మికులు, చర్మశుద్ధి కార్మికులు ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వార్తాపత్రిక విక్రేతలు తదితరులు ఈ - శ్రామ్  కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వారు ప్రకటించారు. ఈ - శ్రామ్ ద్వారా పేరు నమోదు చేసుకున్న వారికి 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా వర్తించబడుతుంది. మధిర మండల పరిధిలో గ్రామాలలో మరియు మునిసిపాలిటీల ప్రజల మధ్య సరైన అవగాహన లేక ఈ నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో ప్రజలలో అవేర్నెస్ పెంచి ఈ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుచున్నారు