విఆర్ఎలకు అందరికి పే స్కేల్ వర్తింపజేయాలి

Published: Wednesday July 20, 2022
రాష్ట్ర విఆర్ఎల కో కన్వీనర్ వంగూరు రాములు
వికారాబాద్ బ్యూరో జూలై 19 ప్రజాపాలన : 
2020 సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా విఆర్ఎ లందరికీ పేస్కేల్ ఇస్తామని సిఎం కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేశారని రాష్ట్ర విఆర్ఎల కో కన్వీనర్ వంగూరు రాములు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లబ్ లో విఆర్ఎల సమస్యల పరిష్కారం గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ..విఆర్ఎ ల వారసులకు తండ్రుల స్థానంలో తమ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని నిండు శాసనసభలో  ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం విదితమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా అన్ని సౌకర్యాలు వస్తాయని ఆశించి, గత 20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అర్హత కల్గిన వారికి పదోన్నతులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదిని వీఆర్వోలు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వెయ్యిల మంది గ్రామ రెవిన్యూ సహాయకులు ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో క్రిందిస్థాయి ఉద్యోగులుగా ఉంటూ, సమగ్ర కుటుంబ సర్వే నుండి నేటి దళిత బంధు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవటంలో విఆర్ఎలు ప్రధాన భూమిక పోషించారని. వీరిలో నూటికి 90 శాతం మంది పైగా సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన దళిత కులాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారాని. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు, వచ్చే అత్యల్ప వేతనాలతో విఆర్ఎల కుటుంబాలు అర్థాకలితో జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే జీతం చాలక అప్పులు చేసి, అప్పులు తీరక అనేకమంది విఆర్ఎలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేసి అర్హత కల్గిన విఆర్ఎలకు  పదోన్నతి కల్పించాలని,  55 సంవత్సరంల వయస్సు పైబడిన విఆర్ఎల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని  వారికి పెన్షన్  మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కే సత్యనారాయణ గోపాల్ చంద్రయ్య బాలరాజ్ కొత్తగడి సరోజ, మహేందర్, కొటాలగూడ సరోజ ప్రకాష్ జిల్లాలోని వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.