జనసేన మండల అధ్యక్షులుగా తుపాకుల చార్వాకుడు..

Published: Wednesday June 29, 2022
తల్లాడ, జూన్ 28 (ప్రజాపాలన న్యూస్) :  జనసేన తల్లాడ మండలపార్టీ అధ్యక్షులుగా మండలంలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన తుపాకుల చార్వాకుడు నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నియమించిన నియామకపు ఉత్తర్వులు ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా చార్వాకుడు మాట్లాడుతూ మండలంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. అదేవిధంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తనకు ఈ పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.