మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగశ్రావణి

Published: Monday October 03, 2022

జగిత్యాల అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని పట్టణంలోని పురనిపేట, మంచినిల్ల బావి, గాంధీనగర్ లో వారి విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగశ్రావణిప్రవీణ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్బంగా చైర్పర్సన్ మాట్లాడుతూ. జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని తన విశ్వసాలను, సిద్ధాంతాలను అంధులో పరిశోధించిన గాంధీజీ. భారతీయ చింతనకు కొత్త రంగులద్దారు. సత్యం, అహింసలను వెలుగులోకి తెచ్చి, ఒక వినూత్న పద్ధతిలో ఆచరించి చూపారు. అందుకే అయన విష్వజ్యోతి అయ్యారు. ఆయనే సిద్ధాంతాలు పాటిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని, వారి ఆశయాలు ప్రతి ఒక్కరి గుండెల్లో చీర స్థాయిగా నిలిచి ఉన్నాయని తెలిపినరు. ఈ కార్యక్రమంలో కమిషనర్ గంగాధర్, వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు బోడ్ల జగదీష్, కౌన్సిలర్స్ మేక పద్మావతి, నక్క   జీవన్, కో అప్సన్ రియాజ్ మామా, శ్రీనివాస్, డిఈ రాజేశ్వర్, కార్యాలయ సిబ్బంది, నాయకులు  టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దూమల్ల రాజు కుమార్, బలే శంకర్, మేక పవన్, కొత్తకొండ అంజయ్య, పవన్, శ్రీనివాస్, క్రాంతి, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.