మేడ్చల్ జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులుగా నామ శ్రవణ్

Published: Tuesday June 15, 2021
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులుగా ఉప్పల్ కు చెందిన నామ శ్రవణ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చల్ల ప్రభాకర్ యువ మోర్చా ఉపాధ్యక్షులుగా నామ శ్రవణ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నామ శ్రవణ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకపోతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ  ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు భానుప్రకాష్, జిల్లా అధ్యక్షులు చల్ల ప్రభాకర్ మరియు ఉప్పల్ సీనియర్ బీజేపీ నాయకులు గొరిగే కృష్ణ, శామీర్పేట ధర్మారెడ్డి, మహంకాళి లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, బొంగు రమేష్ గౌడ్, కొల్లు బాలరాజ్, రెడ్డిగారి దేవేందర్ రెడ్డి,రెవెళ్లి రాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు నామ శ్రవణ్ తెలియజేశారు.