పి హెచ్ సి కి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను అందజేస్తున్న పోతినేని సుదర్శన్ రావు, పసుమర్తి రంగా

Published: Saturday June 26, 2021
బోనకల్లు, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  పోతినేని సుదర్శన్ రావుమండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేతన ఫౌండేషన్ సంస్థ స్పందించిన ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ మండల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. చేతన పౌండేషన్ సంస్థ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు లక్ష రూపాయల విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను ఉచితంగా బహూకరించింది. దీనిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆ సంస్థ కార్యదర్శి పసుమర్తి రంగారావు మండల ప్రాథమిక వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్యం కోసమే తాను చేతన ఫౌండేషన్ సంస్థను సంప్రదించినట్లు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ సమస్యను గూగులోతు రామకృష్ణ తన దృష్టికి తీసుకు వచ్చారని దీంతో  తాను ఫౌండేషన్ సంస్థ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారంగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను ఉచితంగా అందించినందుకు సంస్థకు ఆయన న కృతజ్ఞతలు తెలిపారు. చేతన పౌండేషన్ సంస్థ జిల్లా వ్యాప్తంగా అనేక రూపాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేయూత అందిస్తున్నారన్నారు. చేతన పౌండేషన్ మండల ప్రజలు అందరికీ ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందించడం ఎంతో అభినందనీయం అన్నారు. సంస్థ నిర్వహించే అన్ని సేవాకార్యక్రమాలకు సిపిఎం పార్టీ అన్ని వేళల అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. మండల ప్రాథమిక వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ తో పాటు వైద్య సిబ్బంది మండల ప్రజలకు కరోనా సమయంలో ఎంతో విలువైన వైద్య సేవలను అందించారని వైద్య సిబ్బంది అందరిని పోతినేని సుదర్శన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. చేతన పౌండేషన్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరకి ఉపయోగించి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. దీనిని సమర్ధవంతంగా వినియోగించుకొని ఇంకా ఏదైనా అవసరమైతే చైతన్య ఫౌండేషన్ ద్వారా అందించేందుకు తాము కృషి చేస్తామని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసమే అందించాం- పసుమర్తి రంగారావు మండలంలో కరోనా ప్రభావం అధికంగా ఉందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కోసమే తమ సంస్థ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను అందిస్తున్నట్లు చేతన పౌండేషన్ కార్యదర్శి పసుమర్తి రంగారావు తెలిపారు. దీనిని పూర్తిస్థాయిలో మంచిగా వినియోగించుకుంటే ఇంకా ఏదైనా అవసరం ఉంటే తాము తప్పకుండా ప్రజల కోసం అందజేస్తామని తెలిపారు. వైద్యాధికారి సిబ్బంది కరోనా సమయంలో ప్రజలకు విలువైన వైద్యసేవలు అందిస్తున్నట్లు పోతినేని సుదర్శన్ రావు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే తమ సంస్థ 50 శాతం భరిస్తుందని మిగిలిన 50 శాతం నిర్వాహకులు భరించాల్సి ఉంటుంది అన్నారు. తాము ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాత్రమే సహకారం అందిస్తామని, వ్యక్తిగత ప్రయోజనాలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించమన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మండల ప్రజలకు దీనిద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. సమస్యను గూగులోతు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లామండల వైద్యాధికారి శ్రీకాంత్ మండలంలో కరోనా ఉద్ధృత రూపంలో ఉన్న సమయంలో అనేకసార్లు ఇతరుల వైద్యం కోసం టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గూగులోతు రామకృష్ణ పీహెచ్సీకి వచ్చేవారని మండల ప్రాథమిక వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ తెలిపారు. ఆక్సిజన్ లేక ఖమ్మం పెద్దాస్పత్రిలో కూడా కరోనాతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను దాతల ద్వారా సమకూర్చేందుకు ప్రయత్నించాలని ఆ సమయంలో తాను రామకృష్ణ ను కోరినట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత  రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సాధ్యమైనంతవరకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారని తెలిపారు. ఆ కృషి కార్యరూపం దాల్చి పి హెచ్ సి కె ఆక్సిజన్ పరికరం అందజేయటం నాతో పాటు మా సిబ్బంది అందరికీ ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో తాము ప్రజలకు అందిస్తున్న సేవలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తామని, దీనిని వందకు వంద శాతం ప్రజల కోసం జాగ్రత్తగా ఉపయోగిస్తామని అన్నారు. గూగులోతు రామకృష్ణ కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా చేతన పౌండేషన్, పోతినేని సుదర్శన్ రావు, గూగులోతు రామకృష్ణ లకు ఆయన వినయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం నాయకులు సాధినేని మల్లికార్జునరావు, తెల్లకుల శ్రీనివాసరావు ఉమ్మ నేని రవి, బోయినపల్లి వీరబాబు, కొమ్ము శ్రీనివాసరావు, ముక్కపాటి అప్పారావు, కందిమల్ల రాధ, తుళ్లూరు రమేష్, చెన్నా లక్షాద్రి, పాపినేని అప్పారావు, ఏసుపోగు బాబు సంస్థ సభ్యులు చంద్రకాని నవీన్, అంతోటి పుల్లారావు, నాగరాజు, ఈశ్వర్, అచ్యుత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.