పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

Published: Thursday June 16, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 15 ప్రజాపాలన : నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖా మాత్యులు టి. హరీష్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనేందుకు హాజరువుతున్న సందర్బంగా అన్ని ఏర్పాట్లు పక్కడబందిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కొడంగల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డితో కలసి మంత్రుల పర్యటన సందర్బంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై  వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొడంగల్ పట్టణంలో డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి నూతన భవనము, డయాలైసెస్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ - వెజ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నందున ముమ్మరంగా పనులు చేపట్టి సాయంత్రం వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  డిగ్రీ కళాశాల, ఆసుపత్రి,  సభా ప్రాంగణం వద్ద పిచ్చి మొక్కలు, చేత్త చేదారాన్ని తొలగించి పరిశుభ్రం చేయాలన్నారు.  ఇట్టి ప్రాంతలలో విరివిగా పెద్ద సైజు చెట్లు నాటాలని సూచించారు. డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి తన వాట్సాప్ కు పంపించాలన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో చేపడుతున్న పనులను శాసనసభ్యులతో కలసి పరిశీలించారు.  సభ ప్రాంగణాన్ని పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి, తాండూర్ ఆర్ డి ఓ అశోక్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, ఎంపీపీ బుదప్ప, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషా రాణి, మున్సిపల్ కమీషనర్ నాగరాజు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.