బహుజన ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం,అగ్రవర్ణ ప్రజా ప్రతినిధులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చే

Published: Monday May 03, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా, మే 2, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా కేంద్రంలో దళిత బహుజనుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మాజీ ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అణచివేసే కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డ కమిట్మెంట్తో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఉద్యమ సమయంలో జైల్ లలో ఉండే ఉద్యమ కారులకు బెయిల్ ఇప్పించి వారికి మనో ధైర్యం ఇచ్చి ఉద్యమంను నీరు కార్చకుండా ఉద్యమంను మరియు అన్ని కుల సంఘాలతో చర్చలు జరిపి అన్ని కులాలను ఒక్క తాటి పై తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర వహించిన రాజేందర్ పై 20 సంవత్సరాలుగా రాని ఆరోపణలపై ఈ రాష్ట్రంలో లో కెసిఆర్ నియంతృత్వ పాలనపై అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రభుత్వ వైఖరిని కొన్నికొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మా రాజేందర్ ని రాజకీయంగా అణచివేసే కుట్రలో భాగంగా భూకబ్జా ఆరోపణలు చేయించి అప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా నిజానిజాలు తేల్చాలని వివిధ సంస్థలు ముఖ్యమంత్రిగా ఆదేశించి నిజాలు నివేదికలు రాకముందు మంత్రిగారి వైద్య ఆరోగ్య శాఖ బదిలీ చేయించి ఆత్మగౌరవాన్ని ఆహ్వానించడాన్ని కెసిఆర్ నియంతృత్వ విధానాలు దళితులకు బలహీనవర్గాల ప్రజా ప్రతినిధులకు వేరుగా ఉండడమేనని గతంలో ముఖ్యమంత్రి పై ముఖ్యమంత్రి కుమారునిపై త్రిబుల్ వన్ భూముల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇల్లు మంత్రి మల్లారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి శాసన సభ్యులు కెసిఆర్ బంధువులు కుటుంబ సభ్యుల పై పక్కా ఆధారాలతో అనేకమంది వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేసీఆర్ దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై ప్రత్యేక ఆరోపణలు రాకుండా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం నేడు బీసీ సామాజికవర్గం ముదిరాజ్ చెందిన మంత్రి ఈటెల రాజేంద్రను శాఖ నుండి  తొలగించడాన్ని కెసిఆర్ వివక్షత నేనని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులు వివిధ పార్టీల అణచివేతకు గురైన టువంటి నాయకులంతా కెసిఆర్ ను ఎదుర్కోవడం కోసం కలిసి ఉద్యమిస్తామని అన్నారు భూకబ్జాలు చేసిన అగ్ర వర్ణాల మంత్రులు అయిన మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గంగుల కమలాకర్ ల పై ఎన్నో రకాలుగా పత్రికలలో వార్తలు వచ్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కానీ బడుగు బలహీన వర్గానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన ఈటెల రాజేందర్ పై ఇలా కబ్జా సాకు పెట్టి అతని ఆధీనంలో ఉన్న వైద్యశాఖను రాజేందర్ తో ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంబడే అతని పోర్ట్ పోలియో ను తన ఆధీనంలోకి తీసుకోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహ, స్వామి, బీసీ నాయకులు కౌన్సిలర్ కైరం కొండ వెంకటేష్, కుక్కదూవు సోమయ్య, హీరేకార్ వెంకటేష్, కడారి వెంకటేష్, సిరిపురంగ ప్రకాష్, ఇటుకల దేవేందర్, కొల్లూరు రాజు, నరాల రాజు, సాల్వేర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.