మున్సిపాలిటీ లో ఆసరా పెన్షన్లు పంపిణీ మధిర

Published: Friday September 09, 2022

సెప్టెంబర్ 8 ప్రజా పాలన  ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్లు  అత్యధికంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణఆసరా పెన్షన్లు రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మున్సిపాలిటీ పరిధిలో 4,13,14 వార్డ్ లో నూతన ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన  మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఆసరా పెన్షన్లు భారీగా మంజూరు చేసి నిరుపేద కుటుంబాలకు  కొత్తగా మంజూరు అయిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు పెన్షన్లు సర్టిఫికెట్ తో పాటుగా లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను కలుపుకుంటూ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా ఉందని అన్ని వర్గాల ప్రజలకు రైతులకు ప్రజల గుండెల్లో కెసిఆర్ శిరస్థాయిగా ఉంటారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో 13 వ వార్డు కౌన్సిలర్ బిక్కి అనిత ,14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వరరావు , మున్సిపల్ కమిషనర్ రమాదేవి , టిఆర్ఎస్ నాయకులు కపిలవాయి జగన్మోహన్ రావు ,మున్సిపల్ సిబ్బంది ఆర్ పి లు లబ్ధిదారులు  తదితరులు పాల్గొన్నారు