ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ అనురాధ ఎంపీపీ వజ్జా రమ్య.

Published: Tuesday October 25, 2022
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ అనురాధ ఎంపీపీ వజ్జా రమ్య..
 
 
పాలేరు అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి
 మండల పరిధిలోనిమండ్రాజుపల్లి గ్రామంలో సి డి సి
చైర్మన్ నెల్లూరు లీలా ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ అంబికా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ రెడ్యం నాగ నర్సిరెడ్డి వారి సౌజన్యంతో 
గ్రామంలోని రైతు వేదికలో  ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ నెల్లూరి అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీ డి సి  చైర్మన్ నెల్లూరు లీలా ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ అంబికా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ చైర్మన్ రెడ్డెం నాగ నర్సిరెడ్డి కి డాక్టర్స్ కు  కృతజ్ఞతలు తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు 
భవానీ హాస్పిటల్, శ్రీ విజయ లక్ష్మి హాస్పిటల్, అక్షయ కంటి హాస్పిటల్, శ్రీ పెరంబదూర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు వజ్జా శ్రీనివాస రావు, మరికంటి రేణు బాబు, వార్డు సభ్యులు తోళ్ళ బుచ్చాలు, తుమ్మా ఉపేందర్ అవుట వీరబాబు గ్రామ పంచాయతీ సిబ్బంది రోగులు తదితరులు పాల్గొన్నారు