ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి . ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష

Published: Monday January 02, 2023

 జన్నారం, జనవరి 01, ప్రజాపాలన:  ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, జిఓ 317 అమలు కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్        తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా బదిలీ లేకపోవడంతో  ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో 8 నుంచి 11 సంవత్సరాలుగా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నెలకొని ఉందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులు లేనిచోట ఉపాధ్యాయులు ఉండటంతో విద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుందని వెంటనే రేషనలైజేషన్, పదోన్నతుల, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు తగు న్యాయం చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పేద పిల్లలకు టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు అందించేందుకు ప్రభత్వం  ప్రతిపాదనలు సిద్ధం చేయడాన్ని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అదే విధంగా నోట్ బుక్స్ కూడా ఉచితంగా అందించాలని అయన కోరారు. ప్రాథమిక స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం పకడ్బందీగా అమలగుటకు,
 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించేందుకు   ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఒకేరోజు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు ఉండటంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్న దృష్ట్యా వేరువేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామటెంకి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య  రాజన్న, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ముంజం మల్లేష్, మండల అధ్యక్షులు తుంగూరిగోపాల్, తదితరులు పాల్గొన్నారు