వైద్య విధాన పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ గా విజయ్ ప్రశాంత్ నియామకం

Published: Wednesday March 01, 2023
* రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆర్ కృష్ణ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 28 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ గా విజయ ప్రశాంతును సీఎం కేసీఆర్ నియమించినందుకు శుభాభివందనాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిజెపి నాయకులు బిఆర్ కృష్ణ ముదిరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో వైద్య విధాన పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ గా రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్ ప్రశాంత్ ను ఆయన  స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామని స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆర్ కృష్ణ ముదిరాజ్ ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విద్యార్థులు బిఆర్ సాయి తేజ ముదిరాజ్ అతని స్నేహితులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ కృష్ణ ముదిరాజ్ విజయ్ ప్రశాంత్ కు షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. విజయ్ ప్రశాంతును హైకోర్టులో వైద్య విధాన పరిషత్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమించడం తో బీసీలకు దక్కిన గొప్ప గౌరవం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభివందనాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విజయ ప్రశాంత్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. న్యాయవాదుల జేఏసీలో ప్రధాన భూమిక వహించారని వివరించారు. విజయ ప్రశాంత్ తెలంగాణ వచ్చేంతవరకు ఆహర్నిశలు కష్టపడ్డాడని పేర్కొన్నారు. ఉద్యమకారుడు మహా మేధావి అయిన విజయ ప్రశాంత్ ను ఆలస్యంగానైనా గుర్తించి తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ధన్యవాదాలు తెలిపారు.