ఆడబిడ్డల సంతోషమే సిఎం కేసీఆర్ ఆశయం

Published: Friday July 23, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ 22 జూలై ప్రజాపాలన బ్యూరో : రాష్ట్రంలోని ఆడబిడ్డల సంతోషమే సీఎం కేసీఆర్ ఆశయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మున్సిపాలిటీ, మండల పరిధికి చెందిన 14 కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 14 లక్షల ఒక వేయి 624 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబాలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకంను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్ని ప్రభుత్వాలు పని చేసిన పేదల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలు అమలు చేయలేదని అన్నారు. పెళ్లయిన తర్వాత మొదటి కాన్పు కోసం తల్లిదండ్రులు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా కార్పొరేటు ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించి13 వేల రూపాయలు మరియు కేసిఆర్ కిట్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.