రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

Published: Thursday October 28, 2021
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. కరువు పీడిత ప్రాంతాలను విముక్తి చేసేందుకు సీఎం కేసీఆర్ సాగు, తాగునీరు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ బలోపేతానికి ప్రతిఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బలదేవారెడ్డి, ముత్యంరెడ్డి, లక్ష్మారెడ్డి, పుల్లగుర్రం విజయానంద్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, కర్నాటి రమేష్ గౌడ్, చీరాల రమేష్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జెర్కొని రాజు, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు నిట్టు జగదీష్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, బంటి యూత్ ఫోర్స్ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.