బర్మని మల్లిఖార్జున్ కి గౌరవ డాక్టరేట్

Published: Tuesday March 22, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : తమిళనాడు హోసూరులోని ఎవిఎస్ఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తెలంగాణ వీరశైవ లింగాయత లింగబలిజ సమన్వయ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ సమాజ సేవకులు, బసవ తత్వ రచయిత బర్మని మల్లిఖార్జున్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగింది. బర్మని మల్లిఖార్జున్ కి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాదిమి శివకుమార్, లింగయత సమాజం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ముస్తాపురే, తెలంగాణ లింగాయాత యువత హర్షం వ్యక్తం చేశారు. సమాజ సేవకులు, రచయిత, వీర శైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్మని మల్లికార్జున్ పుట్టిన రోజు వేడుకలో తన సేవలను కొనియాడిన కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు, మిత్రులు శ్రేయోభిలాషులు, అభిమానులు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ముస్తాపురే, కన్నడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అండ్ ఎడిటర్ ధర్మేంద్ర పూజారి, యూత్ ఐకాన్ సాయి తేజ రావు, విద్యావేత్తలు జగ్ జ్యోతి కౌర్, మహాదేవ్ ముండే తదితరులు పాల్గొన్నారు.