యువత నేతాజీ ని స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం, మంచి పాలన కోసం పోరాడాలి -రవి కుమార్ యాదవ్

Published: Monday January 24, 2022
శేరిలింగంపల్లి - ప్రజాపాలన (జనవరి 23) : మాదాపూర్ డివిజన్ బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో సుభాష్ చంద్ర బోస్ నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జన్మదినం "పరాక్రమ్ దివస్‌" సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది, ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన రవి కుమార్ యాదవ్ మరియు బీజేవైఎం నాయకులు, బిజెపి పార్టీ నాయకులు, రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి, పరాక్రమ దివాస్ జరుపుకుంటున్నాం, భారత స్వాతంత్ర్య సమర వీరులలో అగ్రగణ్యుడు, పుట్టుకే గాని మరణం లేని మహావీరుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో, తన అసమాన త్యాగాలతో ఆయన భావితరాలకు ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తారు. మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, 1923 లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, గాంధీజీ మరియు మరికొంతమంది నాయకులు అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే ఆయనతో విభేదించి, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారు, స్వాతంత్ర్య పోరాటంలో 11 సార్లు జైలుకు వెళ్లిన పట్టు వదలని మాహా నాయకుడు, రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఇదే సువర్ణవకాశమని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్‌లో పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించింది, భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నేతాజీకే చెందుతుంది. నేతాజీ జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి స్వామి వివేకానంద గారి స్ఫూర్తి తో ఏ రోజు వెనకడుగు వేయలేదు, నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కనుమరుగై పోయారు, అని అన్నారు, కావున యువత నేతాజీ గారిని స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం, మంచి పాలన కోసం పోరాడాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్. రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్. మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ బీజేవైఎం ప్రెసిడెంట్ ఆనంద్, శ్రీధర్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీశైలం కురుమ. జితేందర్. నవీన్ రెడ్డి, రమేష్ రెడ్డి. ఆకుల నరసయ్య, చక్రి తదితరులు పాల్గొన్నారు