కోవిడ్-19 నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలు

Published: Monday September 13, 2021
యాదాద్రి 12 సెప్టెంబర్ ప్రజాపాలన: కోవిడ్-19 నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలు. ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాల మూలంగా రెండవ విడత కరోనా రాష్ట్రంలో అదుపులోకి వచ్చిందనే సంగతి విధితమే. ఆఫీస్, మార్కెట్ సముదాయాలు హోటల్, బస్ మరియు రైలు ఇతర ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులను చేరవేసే  వాహనాలలో  తప్పని సరిగా శానిటైజర్/నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి మాస్కు తప్పని సరిగా ధరించాలి, భౌతిక దూరం పాటించాలని అధికారులు పదే పదే గుర్తు చేస్తున్నారు. కొందరు యస్.ఎమ్.ఎస్ విధానంను సక్రమంగా పాటిస్తు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి దోహదం చేస్తున్నారు. ఇలాంటివి తమకు పట్టవంటూ కనీసం మాస్కు కూడా ధరించని వారున్నారనేది యదార్థం. యాజమాన్యం తమ సిబ్బందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రవర్తించాలి. సిబ్బందికి మాస్కులు ఇప్పించాలి మరియు వారికి వినియోగదారులతో ఎలా మసలు కోవాలో తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.