పారిశుద్ధ్య నిర్వహణపై పకడ్బంధీగా చర్యలు చేపట్టాలి.

Published: Thursday December 15, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
 మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 14, ప్రజాపాలన :
 
జిల్లాలో సింగరేణి ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులు పకడ్బంధీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి మందమర్రి, బెల్లంపల్లి, నస్పూర్, క్యాతన్ పల్లి మున్సిపల్ కమీషనర్లు, సింగరేణి అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్వహణ కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించడం జరిగిందని, ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయడం కొరకు రెండు చెత్త బుట్టలను పంపిణీ చేయడంతో పాటు ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. పురపాలక సంఘాల పరిధిలో చేపట్టే నూతన ప్రాజెక్టులకు సంబంధిత సమాచారాన్ని మున్సిపాలిటీలకు అందించాలని తెలిపారు. మున్సిపాలిటీలకు బకాయి ఉన్న పన్నులపై సంస్థ ప్రతినిధులు దృష్టి సారించాలని తెలిపారు. సింగరేణి ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై పురపాలక సంఘం అధికారులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 * నాణ్యమైన గుణాత్మక విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయం
 
నాణ్యమైన గుణాత్మక విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి కేంద్రీయ విద్యాలయం అధికారులు, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం ఉండాలని తెలిపారు. విద్యార్థులు విధ్యాభ్యాసన ప్రక్రియలో విద్యాబోధన, హోమ్వర్క్తో పాటు ఇతరత్రా అంశాలను విద్యార్థులు నేర్చుకొనే విధంగా పర్యవేక్షించాలని తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తరగతి విద్యాబోధనలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు రివిజన్ చేయడం ద్వారా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. రెగ్యులర్ ఉ ఉ పాధ్యాయులతో పాటు తాత్కాలిక పద్దతిన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యాబోధన చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.   ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ సుభాషిణి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీరాజ్ ఈ. ఈ. జాదవ్ ప్రకాష్, పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.