గుడిసె దగ్ధంమై జీవనాధారం కోల్పోయిన కుటుంబానికి : అండగా ఫ్రెండ్స్ వెల్ఫైర్ చారిటబుల్ ట్రస్ట

Published: Thursday August 05, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 04 ( ప్రజా పాలన ప్రతినిధి) : మండలంలో ఎర్దండి గ్రామంలోని వడ్డెర కాలనీలో అల్లకుంట ఎల్లయ్య వారి కుటుంబం నివశిస్తున్నా గుడిసె ప్రమాదవశాత్తు కాలిపోయి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ వారి సామాన్లు, బట్టలు, మంచాలు, బియ్యం, బాషన్లు, వాళ్ళ అబ్బాయి సర్టిఫికేట్స్, పాస్ పోర్ట్ మరియు  అన్ని వస్తువులు కాలి బుడిదగా అయిపోయయి. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎలాంటి జీవనాధారం లేక చెట్టుకింద నివశిస్తున్నారు. అలాంటి కుటుంనికి ఫ్రెండ్స్ వెల్ఫైర్ చారిటబుల్ ట్రస్ట్ వారు అండగా ఉంటూ వంట సామగ్రి,బట్టలు, దుప్పట్లు, ఇతర నిత్యావసర వస్తువులు సుమారు 5000 రూపాయల విలువైన వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బట్టు శేఖర్, నాయకులు బాశెట్టి గణేష్, కల్లెడ గంగాధర్,దాసరి గంగానర్సయ్య, నల్లపు బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.. ఇంతటి ఆదర్శవంతమైన  సేవాకార్యక్రమానికి పూనుకున్నా ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి గ్రామస్తులు, కాలనీవారు కృతజ్ఞతలు తెలిపారు..