కాలనీవాసులకు ధైర్యంగా ఉండాలి : దిండు భూపేష్ గౌడ్

Published: Saturday May 15, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : కరోనా మహమ్మారి పాజిటివ్  వస్తే భయపడకుండా ఇంట్లోనే ధైర్యంగా ఉండాలని, మనోధైర్యం కోల్పోకుండా డాక్టర్ సలహాలు సూచనలు పాటిస్తే సరిపోతుందిని మీర్ పేట్ బీసీ సెల్ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ అన్నారు. బాలపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం ఎల్ ఆర్ కాలనీ, ఎస్ ఎల్ ఎన్ ఎల్ కాలని లలో నిరుపేద కుటుంబాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటికి వారానికి సరిపోయేటట్లు కూరగాయలు నిత్యావసర సరుకులు సొంత ఖర్చుతో ఇవ్వడం మానవత్వానికి సాటిలేదని మాజీ ఎంపీటీసీ టిఆర్ఎస్ కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడు శుక్రవారంనాడు ఇంటింటికి నిత్యవసర సరుకులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు విజ్ఞప్తి చేస్తూ, కరోనాతో మరణం అనుకోని భయపడకుండా, ధైర్యంగా ఉండాలని డాక్టర్ సలహాలతో జాగ్రత్తలు పాటిస్తే కరోనాను కట్టడి చేయొచ్చని చెప్పారు. కరోనా వచ్చిన వ్యక్తులు సలహాలు పాటిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.