అడిషనల్ కలెక్టర్ ఆదేశించిన పట్టించుకోని అధికారులు : కొలిపాక శ్రీనివాస్ అఖిల పక్షం నాయకుడు

Published: Tuesday October 19, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : అధికార పార్టీ నాయకుడు (మాజీ కౌన్సిలర్ పత్తిపాక రాజ్ కుమార్) బెల్లంపల్లి పట్టణంలో సమాధులను, దేవాలయాల భూములను, కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెల కిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వాటిపై తక్షణమే చర్యలు తీసుకొనీ తనకు న్యాయం చేయాలని స్థానిక అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని అఖిలపక్ష నాయకులు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. సోమవారం నాడు కొలిపాక శ్రీనివాస్ "ప్రజాపాలన" ప్రతినిధితో మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో ని కాంట్రాక్టర్ బస్తీ లో ఉన్నటువంటి స్మశాన వాటిక స్థలంలో మా తండ్రి గారిది, మా మామ గారి సమాధుల ప్రక్కన ఉన్న కాళీ స్థలాల్ని ఆక్రమించి రూములు నిర్మించి వ్యాపారాలు నడుపుకుంటూ అద్దెలకు ఇచ్చినారని, అలాగే బాలవర సిద్ధి వినాయక మండలి స్థలంలో రూములు నిర్మించి అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారని వీటిపై చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మించిన సముదాయాలను కూల్చివేయాలని స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు స్థానిక అధికారులు స్పందించడం లేదని అందుకే గత జూన్ నెలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు చేసిన సంఘటనపై వెంటనే విచారణ చేసి అక్రమంగా నిర్మించిన రూముల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలను కూడా తుంగలో తొక్కి స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా తాతల, దండ్రుల, బంధువుల, సమాధుల స్థలం వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, బాలవరసిద్ధి వినాయక మండపం స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని లేనిపక్షంలో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటానని ఆయన అన్నారు.