సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్లు అమలు చేయాలి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ ర

Published: Wednesday November 02, 2022
బోనకల్ ,నవంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన జాతీయ విద్యా విధానం దేశ సమైక్యతకు, రాజ్యాంగ విలువలకు ప్రమాదమని దాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు డిమాండ్ చేశారు. స్థానిక ఎం ఆర్ సి కార్యాలయంలో 
టీఎస్ యుటిఎఫ్ మండలాధ్యక్షుడు బి ప్రీతం అధ్యక్షతన జరిగిన మండల స్థాయి కాంప్లెక్స్ కమిటీల ఎన్నిక కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ దేశ లౌకిక, ఫెడరల్ విధానాన్ని దెబ్బతీసే ఎన్ ఈ పి ప్రమాదకరం అన్నారు. సిపిఎస్ ని రద్దుచేసి పాతపెన్షన్ అమలు చేయాలన్నారు. దేశమంతా ఒకే విధానం అమలు చేయాలని చూస్తున్న కేంద్ర పాలకులు ఒకే పెన్షన్ విధానం ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు.అదేవిధంగా సీఎం హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు చేపట్టాలన్నారు. గత మూడు విడతలుగా బకాయి ఉన్న కరువు భత్యం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న ఎరియర్ బిల్స్ విడుదల చేయాలని, జిపిఎఫ్, టీఎస్ జిఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని కోరారు. 
 
 కాంప్లెక్స్ కమిటీ ల ఎన్నిక......
 
కాంప్లెక్స్ కమిటీ ఎన్నికల్లో బోనకల్ స్కూల్ కాంప్లెక్స్ కన్వీనర్ గా పి. గోపాలరావు ,కో కన్వీనర్లుగా డి అనిత, ఎంవీ చెన్నారావు, జానకిపురం కాంప్లెక్స్ కన్వీనర్ గా ఎం, నారాయణ, కో కన్వీనర్లుగా జి శ్రీనివాస్ ,వి నాగమణి, కలకోట కాంప్లెక్స్ కన్వీనర్ గా వీ. మురళి, కో కన్వీనర్లుగా లవకుశ, నసీమా సుల్తానా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, మండల కమిటీ సభ్యులు ఏ పుల్లారావు, బి సౌభాగ్య లక్ష్మి పి. నరసింహారావు, సదా బాబు, ఉపాధ్యాయులు రంగారావు ,సురేష్, అరుణకుమారి, పద్మావతి, పద్మలత తదితరులు పాల్గొన్నారు.