దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం సమంజసం మాజీ మున్సిపల్ చైర్మన్

Published: Monday July 05, 2021

యాదాద్రి భువనగిరి, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : ఆదివారం పట్టణంలో ముందస్తు సమాచారం లేకుండా దళిత సంఘాల నాయకులను ప్రివెన్షన్ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం పోలీసులే లాకప్ డెత్ చేస్తారు. ప్రశ్నించిన ప్రజా సంఘాల నేతలు అరెస్ట్ చేయడం విడ్డూరం బర్రె జహంగీర్ భువనగిరి పట్టణంలో దళిత సంఘాల నాయకులను మధ్య రాత్రి నుండి సుమారు మూడు గంటల ప్రాంతంలో దళిత సంఘాల నాయకులు ఇండ్లలోకి పోలీసులు అక్రమంగా చొరబడి డోర్లు తీయాలని భయబ్రాంతులకు గురి చేసి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య గార్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించడం ఎంత వరకు సమంజసమని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ పోలీసులే దళితులను లాకప్ డెత్ చేస్తారు. అక్రమ అరెస్టులు చేసి విశేషణంగా దళిత నాయకులపై లాఠీలతో ఇష్టమొచ్చినట్టుగా కొట్టి ఇదేంది అన్నట్టు ప్రశ్నించిన వారిని అర్ధరాత్రి సమయంలో ముందస్తు సమాచారం లేకుండా ప్రివెన్షన్ అరెస్టులు అక్రమ అరెస్టులు చేసి గంటల కొద్ది గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న పోలీసులకు రానున్న రోజుల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సరైన బుద్ధి చెప్తామని అన్నారు.