ఖబరస్థాన్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : శ్రీనగర్ పాలకవర్గం

Published: Saturday February 20, 2021
శ్రీనగర్ ఉపసర్పంచ్ లగడపాటిని అభినందించిన మైనారిటీ నాయకులు
భద్రాద్రి ప్రజా పాలన  కొత్తగూడెం ముస్లిం స్మశానవాటికలో అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు శ్రీనగర్ పాలక వర్గ సభ్యులు గ్రామపంచాయతీ పరిధిలో గల ముస్లిం శ్మశాన వాటికలో గత నెలరోజులుగా పారిశుధ్య పనుల్లో భాగస్వామ్యం అయిన పాలకవర్గం స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం సుమారు 10 లక్షల రూపాయల అంచనా విలువతో  డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి మనిషి చివరి మజిలీ చేరే ప్రదేశం అయిన స్మశానవాటిక ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా ప్రణాళిక చేస్తామని తెలిపారు. గత నెల రోజులుగా ఖబరస్థాన్‌ పారిశుధ్య కార్యక్రమంలో తన వంతుగా భాద్యతగా పాటుపడుతున్న శ్రీనగర్ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ ను అభినందించారు. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి రజాక్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు యాకుబ్ ఈ కార్యక్రమంలో శ్రీనగర్ సర్పంచ్ పూణెం నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ లగడపాటి రమేష్, ఎంపీటీసీ  కొల్లు పద్మ, వార్డు సభ్యులు అన్వర్ పాషా గారు,వట్టికొండ సాంబశివరావు, మున్సిపాలిటీ సీనియర్ నాయకులు ఎండి  రజాక్, మసూద్, మున్సిపాలిటీ కో ఆప్షన్ యాకూబ్, ఆబీద్, మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు