మేకవనంపల్లిలో ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు

Published: Monday April 18, 2022
సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 17 ఏప్రిల్ ప్రజాపాలన : ఆధ్యాత్మిక చింతన, భక్తిభావనలు మానవులలో పెంపొందితే శాంతి సౌఖ్యాలు పరిఢవిల్లుతుందని మేకవనంపల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి ఆకాంక్షించారు. మోమిన్పేట్ మండల పరిధిలోని మేకవనంపల్లి గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలను వీరహనుమాన్ తన చల్లని చూపులతో అనునిత్యం కాపాడుతాడని పేర్కొన్నారు. దుష్టశక్తుల నుండి మానవలోకాన్ని రక్షిస్తాడని స్పష్టం చేశారు. హనుమాన్ చందన తిలకం నుదుట దిద్దుకుంటే ఆరోజంతా శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని వెల్లడించారు. భూతప్రేత పిశాచాలు హనుమాన్ తిలకం పెట్టుకున్న వారి దరిదాపుల్లోకి రావని స్పష్టం చేశారు. లోకహితార్థం అవతరించిన అవతార మూర్తి హనుమంతుడని కొనియాడారు. గ్రామం అంతా కాషాయ వర్ణంతో శోభిల్లిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకవనంపల్లి పిఏసిఎస్ చైర్మన్ పట్లోళ్ళ అంజిరెడ్డి, ఎంపిటిసి గోవర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, కారోబార్ శ్రీనివాస్, గ్రమస్థులు, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు.