అంతారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి

Published: Thursday November 24, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన : అంతారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ధారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పట్లోళ్ల నర్సిరెడ్డి పంచాయతీ కార్యదర్శి వసంతలతో పాటు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గల్లీ గల్లీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో పగటి పూట విద్యుత్ దీపాలు వెలుగకుండా ఆఫ్ ఆన్ స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. థర్డ్ వైర్ ఏర్పాటు చేసి పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలన్నారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. గ్రామంలో ప్రతి గురువారం ఏఎన్ఎం లు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. పాశుద్ధ్య పనుల్లో భాగంగా పిచ్చి మొక్కలు, శానిటేషన్ చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంతను ఆదేశించారు.  గ్రామంలో 1వ, 8వ వార్డులలో నీటి కొరత ఎక్కువగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, లీకేజీలను వెంటనే సరి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని పూర్తి స్థాయిలో అందించి, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో అవసరమైన చోట రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో పశువుల డాక్టర్
అందుబాటులో ఉంటూ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని వాడుకలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు రాజుగుప్తా కావలి అంజయ్య ముదిరాజ్ రైతు సంఘం అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.