గణనాథునికి 108 రకాల నైవేద్యాలు, అన్నాదానం

Published: Friday September 09, 2022

జన్నారం, సెప్టెంబర్ 08, ప్రజాపాలన: మండలంలోని పోన్కల్ గ్రామంలో ఆర్యవైశ్య, వర్తక సంఘం ఆద్వర్యంలో ఎర్పాటు చేసిన వినాయకుడి వద్ద 108 రకాల నైవేద్యాలు హరాతులతో పూజలు గురువారం నిర్వహించారు. అదేవిధంగా కవ్వాల్ గ్రామంలో వినాయక మండపాల వద్ద ముస్లీం సోదరులు అన్న దానం చేసి మత సామరష్యాన్ని చాటారు. ఐదు విఘ్నేశ్వరుని  మండపాల్లో ముస్లిం సమక్షంలో  మండల కొ-అప్షన్ సభ్యులు మునవర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో అన్నాదానం చేయడం జరిగింది. ముస్లిం పెద్దలు ఫజల్ ఖాన్, మహమూద్ ఖాన్, కాలిరామ్, నర్సాగౌడ్ లు వున్నారు. అదేవిధంగా యూవశక్తి యూత్ గణేష్ మండలి పోన్కల్ ఆద్వర్యంలో ఎర్పాటు చేసిన గణనాథుని వద్ద పూర్ణచందర్ రావు అన్నాదానం చేయించడం    జరిగింది. ఈ కార్యాక్రమంలో స్థానిక ఎంపిపి మదాడి సరోజన, మదుసూదన్ రావు, యూవశక్తి యూత్ అధ్యక్షుడు మర్రిపేళ్లి శేఖర్, యూవశక్తి యూత్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. అరుంధతి గణేష్ మండలి ఆద్వర్యంలో 108 వత్తులతో దీపారాధన చేయడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాలలో కొలువుదీరిన గజపతులు వచ్చే వాటి కోసం, పోలిస్ స్టేషన్ బ్రిడ్జ్ దగ్గర గణనాథుని శుక్రవారం నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్ తెలిపారు. గురువారం నిమజ్జనం జరిగే ప్రదేశంలో తాత్కాలిక రోడ్డు వేయిస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. గణేష్ నిమజ్జనం వివిధ గ్రామాలలో నుంచి ఇటువైపు వస్తునందున, ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని అయన సూచించారు.