ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపీ గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి

Published: Thursday February 18, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్క బూత్ అద్యక్ష్యులు, కార్యకర్తలు ఓటర్లకు అర్దం అయ్యే విధంగా వివరించి క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా పని చేయాలని బిజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి గజ్జల యోగనంద్ పిలుపునిచ్చారు. బుధవారం  తార నగర్ లోని గొల్లపల్లి రాంరెడ్డి గార్డెన్స్ లో శేరిలింగంపల్లి మరియు చందానగర్ డివిజన్ లు సంయుక్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. చందనగర్ డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి, శేరిలింగంపల్లి  డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జి దేవర కరుణాకర్ కురుమ, గజ్జల యోగనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ, విధివిధానాలపై, బూత్ కమిటీ ల ఏర్పాటు తదితర విషయాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ లను మరో సారి చట్ట సభలకు పంపే బాధ్యత మన అందరి పైన ఉందని నాయకులందరూ సమిష్టిగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా చందనాగర్ డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం కోసం 25,000 రూ. సమర్పించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా నాయకులు రమేష్ సోమిశెట్టి, మారం వెంకట్, రాఘవేంద్రరావు ,ఎల్లేశ్ ,కసిరెడ్డి సింధు రెడ్డి,కాంచన కృష్ణ, శివకుమార్ గారు, వేణు, చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కురుమ, ప్రశాంత్ చారి,  నారాయణరెడ్డి, చంద్రమౌళి, చంద్రమోహన్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .