సీఎం కృషి వల్లే పంజాబ్ ను మించిన తెలంగాణ.. ధాన్యం కొనుగోలు ప్రారంభంలో ఎమ్మెల్యే సండ్ర..

Published: Wednesday November 23, 2022

 తల్లాడ, నవంబర్ 22 (ప్రజా పాలన న్యూస్): ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో దేశంలోనే పంజాబ్ ప్రథమ స్థానంలో ఉండేదని, సీఎం కేసీఆర్ దూరదృష్టి, కృషి వల్లే ఆహార ధాన్యాలు ఉత్పత్తిలో  పంజాబ్ ను తెలంగాణ దాటిపోయిందని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం తల్లాడ, తెలగవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినంత కృషి దేశంలో మరెవరూ చేయలేదన్నారు. అందుకే ఆయన రైతు బాంధవుడయ్యారని గుర్తు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ గతంలో కంటే ఈ ఏడాది జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పెంచామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎం ఎస్ చైర్మన్ రాయల శేషగరిరావు,  తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెమ్ వీర మోహన్ రెడ్డి, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, రైతు సమన్వయ అధ్యక్షులు డుగ్గిదేవర వెంకట్ లాల్, ఏఎంసి వై చైర్మన్ ధూపాటి భద్రరాజు, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఏవో తాజుద్దీన్, ఏపీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.