కంటి సమస్యల పరిష్కారానికి కంటి వెలుగు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Monday January 23, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 20, ప్రజాపాలన :
 
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంతో పాటు కాలేజీరోడ్డులో గల వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 27 గ్రామీణ ప్రాంతాలలో, 13 పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేసి 40 బృందాలను నియమించి ప్రజలకు కంటి పరీక్షల సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. 18 సం||లు పైబడిన ప్రతి ఒక్కరు ఈ శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని, కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు నిర్వహించి మందులు అందించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.