అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

Published: Saturday July 30, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /జూలై 22 :ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో విస్పృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలనెన్నింటినో ప్రవేశపెట్టి, యావత్‌ ప్రపంచం దష్టిని ఆకర్షించేలా తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ లో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అండ్ ఎస్ బి వారి నిధులతో మంజూరైన రూ. 27.00 ఇరవై ఏడు లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జలమండలి అధికారులు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించిందని, దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు. భవిష్యత్తు తరాలు చెప్పుకునే విధంగా తెలంగాణ అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, తెరాస సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, నందు, నరసింహ సాగర్, జంగంగౌడ్, సాగర్ చౌదరి, గణపతి, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, రవి శంకర్ నాయక్, చారీ, పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, కుమార్, లక్ష్మణ్ గౌడ్, సరోజరెడ్డి, విజయ్ కుమార్, ఆనంద్, విజయ్, సయ్యద్ ఖాసీం, జుబేర్, వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.