జాతీయస్థాయి అవార్డు గ్రహీత

Published: Tuesday January 12, 2021
*జాతీయస్థాయి అవార్డు గ్రహీత* 
*మద్దెల శివ కుమార్ ను ఘనంగా సత్కరించి* *అభినందించిన జాతీయ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ* 
 
*బహుముఖ ప్రజ్ఞాశాలి సమాజ సేవకుడు* 
*మద్దెల శివ కుమార్ తెలుగు వాడు కావడం* 
*ఉభయ  రాష్ట్రాలకు గర్వకారణం !*
 
             *డాక్టర్ చింతపట్ల వెంకటాచారి* 
         *మరియు డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస రెడ్డి* 
 
జాతీయ జనసేన సద్భావన పురస్కార గ్రహీత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కవి సినీ గీతరచయిత గాయకులు నిత్య కృషీవలుడు నిరంతర సమాజ సేవకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి మద్దెల శివకుమార్ తెలుగు వాడు కావడం ఉభయ రాష్ట్రాలకు ఎంతో గర్వకారణమని   గత 30 సంవత్సరాలుగా మద్దెల     విద్య సాహిత్య సాంస్కృతిక కళ ఆధ్యాత్మిక సామాజిక చైతన్య రంగాలలో అందిస్తున్న నిరుపమాన సేవలు బహు ప్రశంసనీయము అభినందనీయమని   ప్రతి ఒక్కరూ మద్దెల శివకుమార్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మరియు అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు 
 
10 01 2021 నాడు సాయంత్రం మైలవరం లో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్టాత్మక రావార్షికోత్సవ కార్యక్రమంలో ఇటీవల జాతీయ అవార్డును స్వీకరించిన కొత్తగూడెం భద్రాద్రి వాస్తవ్యులు తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ మద్దెల శివ కుమార్ ను సాదరంగా ఆహ్వానించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించి  మెమొంటో ను ప్రధానం చేశారు 
 
ఈ సందర్భంగా మద్దెల మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని మైలవరంలో తన ప్రతిభను సేవలను గుర్తించి సత్కరించి అభినందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని భవిష్యత్తులో తన సాంస్కృతిక సామాజిక సేవలను ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరింపచేస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు 
అనంతరం కొత్తగూడెం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద రావు గారిని  సింగర్ ఆఫ్ సింగరేణి అపర బాలు అల్లి  శంకర్ ని  సినీ నటులు టి ధనరాజ్ ని 
పూల మాలలు శాలువాలు మెమొంటో లతో ఘనంగా సత్కరించారు 
 
*ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతపట్ల వెంకటాచారి డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస రెడ్డి*  *మద్దెల శివ కుమార్ లతోపాటు   సాయి గ్లోబల్ హారతి కన్వీనర్*  *శ్రీ సాయి శ్రీనివాస్   పర్యవేక్షకులు* 
*శ్రీ వజ్జల బాలాజీ ప్రసాద్ శ్రీ జి హరిహర రావు* 
*శ్రీమతి బి కే  లలిత    శ్రీ గొల్లపల్లి దయానంద రావు*  *అల్లి శంకర్  టి ధనరాజు భూక్య రమేష్* 
*కుమార్ తదితరులు పాల్గొన్నారు* 
                  
                       *కళాభివందనాలతో* 
                 *మద్దెల శివ కుమార్ ఎం ఏ బి ఈ డి* 
*జాతీయ జనసేవ సద్భావన  పురస్కార గ్రహీత* 
*కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు* 
*గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్* 
*అభ్యుదయ కళా సేవ సమితి జిల్లా అధ్యక్షులు* 
*సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు* 
*తెలంగాణ బాలోత్సవ్ వ్యవస్థాపక కన్వీనర్* 
*కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
 
💐🌹💐🌹💐🌹💐🌹