పేదలకు అందని ద్రాక్షలా ప్రభుత్వ వైద్యం.

Published: Thursday February 10, 2022
aసేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు..
పాలేరు ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు మోకాళ్ళ తో నడిచి  ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరండెంట్ అక్కడకు చేరుకొని ఆందోళన చూస్తున్న వారితో మాట్లాడి ఆస్పత్రికి కావలసిన డాక్టర్లు సిబ్బంది ని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమింప జేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ. సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు, మాట్లాడుతూ హాస్పిటల్ లో వైద్యులు లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారని ఆరోపించారు. ఇక్కడ ఉన్న డాక్టర్ ను వీరే చోటకు ఇక్కడి నుంచి పంపే ప్రయత్నం జరుగుతుందని అలాంటి ప్రయత్నాలను వెంటనే నిర్మించుకొని ఆస్పత్రికి కావలసిన సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందన్నారు. పేద ప్రజలకు కావాల్సింది  విద్య వైద్యం. ఈ రెండింటిని కెసిఆర్ ప్రభుత్వం  అందకుండా చేస్తున్నాడుఅని  ప్రవేట్ సంస్థలకు కట్టబెడుతూ న్నదని ఆరోపించారు.. ఈ కార్యక్రమంలో.. ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీ పోతుల అంజని, దోసపాటి శేఖర్, రేగూరి హనుమంతరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, అనంతు సత్యనారాయణ, వడ్డే జగన్, జల్లిపల్లి నాగేశ్వరావు, పాలడుగు అప్పారావు, యాకూబ్, గునగంటి కోటేశ్వరరావు, యడవల్లి నాగరాజు, గొలుసు పవన్, రాచకొండ అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు