వేడుకకు హాజరైన సర్పంచ్ మారెళ్ళ మమత..

Published: Monday October 10, 2022
తల్లాడ, అక్టోబర్ 9 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామానికి చెందిన బయ్యవరపు శ్రీనివాసరావు, రాజేశ్వరి దంపతుల కూతుర్ల ఓనీల అలంకరణ వేడుక ఆదివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, గ్రామ విడిసీ చైర్మన్ మారెళ్ళ మల్లికార్జున్ రావు దంపతులు హాజరై  చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి సత్యవతి, టిఆర్ఎస్ నాయకులు పొన్నం కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, టిడిపి నాయకులు దుగ్గినేని వెంకటయ్య, తదితరులు ఉన్నారు.