కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

Published: Friday June 11, 2021
కోరుట్ల, జూన్ 10 ( ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణ, మండల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ మరియు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు చెక్కులను గురువారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్‌ లబ్దిదారులు సంఖ్య 40 మందికి, రూపాయలు 4,004,640/- అందచేశారు. ఈ కార్యక్రమంలో పట్టణఅధ్యక్షులు అన్నం అనిల్‌, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, టిఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు, పాల్గోన్నారు.