జ్వరాల సర్వే వేగవంతం చేయాలి

Published: Tuesday January 25, 2022

మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిది : మధిర మున్సిపాలిటీలో జ్వరాల సర్వే వేగవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని 15వ వార్డు కౌన్సిలర్ కోనా ధని కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం వార్డులో కొనసాగుతున్న ఇంటింటి జ్వరాల సర్వేని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలేవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించిన వెంటనే ఆశ కార్యకర్త దగ్గర ఉన్న మెడికల్ కిట్ తీసుకొని ఇంటిదగ్గర వాడుతూ ఏడు రోజులు ఇంటివద్దే ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రెండు డోసులు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా అనేది సాధారణ జలుబు లాంటిదని  ఆయన పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త మార్తమ్మ ఆర్పి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.