*ప్రభుత్వ ఆస్పత్రిలో ముమ్మరంగా సాధారణ కాన్పులు*

Published: Wednesday November 09, 2022

మధిర రూరల్ నవంబర్ 8 (ప్రజా పాలన ప్రతినిధి) మండలంలోని దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముమ్మరంగా సాధారణ కాన్పులు చేస్తున్నట్లు దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుఖ ప్రసవం జరిగిన వారికి ప్రభుత్వ అందించే కేసీఆర్ కిట్ ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఆదేశాల మేరకు  దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవంబర్ మొదటి వారంలో రెండు సాధారణ ప్రవసాలు చేయటం జరిగింది అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ కాన్పులు జరిగించాలని  లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం మడుపల్లి గ్రామానికి చెందిన నల్లపు వినీల, ఇల్లూరు గ్రామానికి పెసర మెల్లి రబ్బోని లకు సాధారణ కానుకలు చేయటం జరిగిందన్నారు. కాన్పు అనంతరం  తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముమ్మరంగా కాన్పులు చేయటం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు డాక్టర్ శశిధర్ పర్యవేక్షణలో స్టాప్ నర్సులు అనూష రజిని సృజన సాధారణ కాన్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెలకు పది కాన్పులు అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణరాలు గోలి రమాదేవి సూపర్వైజర్ కౌసల్య ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.