పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు, బాల కళా ఉత్సవం ఎంతో ఉపయోగపడుతుంది,

Published: Friday December 02, 2022
చైర్ పర్సన్ జక్కుల శ్వేత
 
బెల్లంపల్లి డిసెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి:  చిన్నపిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే బాల కళ ఉత్సవం ఎంతో ఉపయోగపడుతుందని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత అన్నారు.
బుధవారం స్థానిక సింగరేణి కళావేదికలో తెలంగాణ రాష్ట్ర, భాష మరియు సాంస్కృతిక శాఖ సహకారంతో టాలెంట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాల కళా ఉత్సవాన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం గెలిచిన పిల్లలకు బహుమతులను అందించారు.
ఈ  కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ట్రైబెల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజినీర్ 
ముడి ముడుగుల శంకర్,
సినీ కొరియోగ్రాఫర్ పంబాల మల్లేష్,యాంకర్ కల్యాణి,అంతర్జాతీయ జానపద కళాకారులు అంతడుపుల నాగరాజు, 
గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి, ప్రోగ్రాం నిర్వహుకులు,డాన్స్ మాస్టర్  సునార్కర్ రాంబాబు,  రమణ, అలీ, డాన్స్ మాస్టర్స్, తదితరులు పాల్గొన్నారు