ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అసి

Published: Wednesday April 19, 2023
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ నిర్వహిస్తున్న సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు కోరారు.
ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోని బండాలేమురు గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే సుఖప్రదంగా సంక్షేమంగా ఇంటికి చేరుతారని చెప్పారు. ఆర్టీసీ సంస్థ ప్రజల కోసం అనేక రాయితీలను ఇస్తుందని వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంస్థ కల్పిస్తున్న బస్సుల రాయితీలైన పాసులు, టి24, టి6 టికెట్లను ఉపయోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను, అలాగే వికలాంగులకు,  ఇంకా అనేక వర్గాల ప్రజలకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలతో రవాణా  సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు.
కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులను నడిపించడం జరుగుతుందని, సంస్థకు నష్టం వచ్చినప్పటికీ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా బస్సులను నడిపిస్తుందని చెప్పారు. ప్రజలు ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని రాయితీలు కల్పిస్తూ ప్రజలకు అనుకూలమైన విధంగా అదనంగా బస్సు సర్వీసులను నడపడానికి సిద్ధంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం డిపో ఎం.ఎఫ్ సత్తయ్య, ఆర్టీసీ అధికారులు సదానందం బండలేమురు మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.