పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి : హెల్త్ సూపర్ వైజర్ రత్నమాల

Published: Wednesday June 30, 2021

మంచిర్యాల, జూన్ 29, ప్రజాపాలన : గర్బినీ స్త్రీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉంటాడని హెల్త్ సూపర్ వైజర్ రత్నమాల, ఎఎన్ఎం నాగలక్ష్మిలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి ఏరియాలో మంగళవారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తహీనతపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీరు గర్భిణీ స్త్రీలకు పలు సలహాలు, సూచనలు చేశారు. చాలా మంది ఆడవాళ్లు రక్త హినత సమస్యలు ఎదుర్కొంటున్నారని దీనిని పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అదిగమించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు ఎన్. పద్మ, కె.విజయలక్ష్మి, కె.స్వరూప, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.