అదిల్ గ్రూప్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Saturday January 07, 2023
* మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ 
వికారాబాద్ బ్యూరో 6 జనవరి ప్రజా పాలన : ఆదిల్ గ్రూప్ నూతన సంవత్సర 2023 డైరీ, క్యాలెండర్ ను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, అదిల్ గ్రూప్ చైర్మన్ మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్, పుడూర్ ఎంపీపీ మల్లేశం, జడ్పిటిసి మేఘమాల ప్రభాకర్ గుప్తాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావిస్తూ కృషి చేస్తున్న మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ సేవలు మరువలేనివని కొనియాడారు. అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఏ సమస్య వచ్చినా ముందువరుసలో నిలిచి పరిష్కరిస్తుండడం అభినందనీయమని అన్నారు. మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ ను ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాజకీయాల్లోనికి రావాలని హితవు పలికారు. మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారిలో ఒకడినై సేవ చేస్తానని అన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే నా దృష్టికి తేగలిగితే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిల్ గ్రూప్ నూతన సంవత్సర 2023 డైరీ, క్యాలెండర్ ను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఒక తీపి గుర్తుగా ఉంటుందని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, జావిద్, రాజేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి మన్నెగూడ గ్రామస్తులు పాల్గొన్నారు.