పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు: జి సి డి ఓ ఉదయశ్రీ

Published: Saturday July 09, 2022
బోనకల్, జూలై 9 ప్రజా పాలన ప్రతినిధి: విద్యార్థులు పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని, ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉందని. జి సి డి ఓ ఉదయశ్రీ అన్నారు. మండలం లోని కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయం, కళాశాలను శుక్రవారం జి సి డి ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జి సి డి ఓ మాట్లాడుతూ కస్తూర్బా విద్యాలయాలు కళాశాలలు ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో ఆ లక్ష్య సాధన దిశగా విద్యార్థులను తీసుకోవాలని ఎస్ ఓ లకు సూచించారు. ముఖ్యంగా గురుకులాలకు మన కేజీబీవీ లకు ఉన్న తేడాను గమనించాలని కోరారు. ప్రవేశ పరీక్షలు పెట్టి కళాశాలలు విద్యాలయాల్లో చేర్చుకుంటున్నారని,మన దగ్గర డ్రాప్ అవుట్ విద్యార్థులు వస్తున్నారని, వారికి సక్రమమైన విద్యను అందించి మంచి విద్యతోపాటు నడవని నేర్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు . రోజువారీ విద్యార్థుల చదువుతోపాటు వాళ్ల ఆరోగ్యం కూడా మనకు చాలా ముఖ్యమని,నిరంతరం వాళ్లను గమనిస్తూ ఉండాలన్నారు. కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠశాల అలవాటు కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, వారితో మంచిగా పాఠశాల అలవాటయ్యే విధంగా చూడాలని టీచర్లకు సూచించారు. పాఠశాల, కళాశాల సిబ్బంది మొదటి నుండి మంచి ఫలితాల కోసం విద్యార్థులను తగిన విధంగా తయారు చేయాలన్నారు. గడిచిన పదో తరగతి ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో మంచి మార్కులు మంచి ఫలితాలు సాధించాం. దానితో సంతోష పడకుండా అంత కన్నా మెరుగ్గా ఈసారి మరిన్ని ఫలితాలు మంచిగా వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయులు పని చేయాలని కోరారు. కొన్ని పాఠశాలల్లో ఆశించినస్థాయిలో ఇంకా ఫలితాలు రాలేదని, ఈసారి మొదటి నుండి అందుకు కృషి చేయాలని కోరారు. 
 
జి సి డి ఓ విద్యార్థులతో మాట్లాడుతూ.....
 
తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపిస్తున్నారు కనుక వారి ఆలోచన, ఆశయాలను నెరవేర్చి మీరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఎదగడం కోసం కష్టపడి చదువుకోవాలని కోరారు. కేవలం బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలు, కళాశాలలో చదువుకునే అవకాశం దొరికినందుకు కష్టపడి ఉన్నతమైన స్థానంలో ఉండాలని విద్యార్థులను కోరారు. ఉపాధ్యాయులు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు.
 
 
 
Attachments area